Breaking: జనసేన బీజేపీ పొత్తు పై తులసీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Indraja |
Breaking: జనసేన బీజేపీ పొత్తు పై తులసీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల జకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఈ పొత్తుల రాజకీయాలపై తాజాగా కాగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ తో పొత్తు కుదుర్చుకుంటున్న బీజేపీ వైసీపీని పక్కన పెడుతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో చేరేందుకు వైసీపీ నుండి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తాం అని తులసి రెడ్డి పేర్కొన్నారు.

అలానే ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ తో పాటుగా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు కోసం జనసేన, టీడీపీ, వైసీపీ ప్రాకులాడుతున్నాయని.. ఇలాంటి పార్టీలకు ఓటు వేస్తె మన వేలితో మన కన్నె పొడుచుకున్నట్లు అవుతోందని వెల్లడించారు.

ఇక ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి కాగ్రెస్ సేవలు అవసరమని.. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల నుండి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారని స్ఫష్టం చేశారు. ఇక బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు దాదాపు ఖాయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి ఇండియా కూటమి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందా..? లేదా అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story