AP:‘నిజ‌మైన యోధుడు నీర‌జ్‌చోప్రా’..మంత్రి అచ్చెన్నాయుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Jakkula Mamatha |
AP:‘నిజ‌మైన యోధుడు నీర‌జ్‌చోప్రా’..మంత్రి అచ్చెన్నాయుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ‌ ఏపీ బ్యూరో,అమ‌రావ‌తి:పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన నీర‌జ్ చోప్రాను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. వ‌రుస‌గా రెండోసారి ఒలంపిక్స్‌లో ప‌త‌కం సాధించిన నీర‌జ్‌చోప్రాకు ఎక్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘నిజ‌మైన యోధుడు నీర‌జ్..గ‌త ఒలంపిక్స్‌లో చ‌రిత్ర సృష్టించి, ఇప్ప‌టికే చ‌రిత్ర సృష్టించామ‌ని అక్క‌డే ఆగి పోకుండా ఈ ఏడాది ఒలంపిక్స్‌లోనూ స‌త్తా చాటి చెప్పి భార‌త‌దేశ ప్ర‌తిష్ట‌ను పెంచిన నీర‌జ్ చోప్రా నిజ‌మైన యోధుడు అన్నారు. ఒక వ్య‌క్తి ఎప్పుడూ నిత్య‌ విద్యార్ధిలా నిరంత‌రం ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న కోసం ప్ర‌య‌త్నం చేయాల‌ని ఈ విజ‌యంతో చాటి చెప్పారు నీర‌జ్ చోప్రా. అంతులేని శ్ర‌మ .. అకుంఠిత దీక్ష‌తో వ‌రుస‌గా రెండో ఒలంపిక్స్‌లో దేశానికి ప‌త‌కాన్ని అందించిన నీర‌జ్ చోప్రాకు రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌ల‌ని’ మంత్రి అచ్చెన్నాయుడు శుక్ర‌వారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed