చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచిన త్రిషా రెడ్డి.. ఎవరీమే?

by Anjali |
చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచిన త్రిషా రెడ్డి.. ఎవరీమే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ నాలుగో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గన్నవరం కేసపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విభజనాంధ్రప్రదేశ్లో ఇది రెండవసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు.. మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా.. తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్, కింజరావు అచ్చెన్నాయుడు వరుసగా 24 మంత్రులు ప్రమాణం చేశారు. ఇకపోతే చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేడుకలో డాక్టర్ పులివర్తి త్రిషా రెడ్డి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు. టీడీపీకి చెందిన చంద్రగిరి శాసన సభ్యుడు పులివర్తి నాని కోడులైన త్రిష రెడ్డి, తన అత్త మామ, పులివర్తి నాని, సుధారెడ్డి, భర్తతో కలిసి త్రిషారెడ్డి ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో నాని కోడలు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ఇక పులివర్తి నాని సుధారెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. అదే తరహాలో నాని తనయుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన త్రిషా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా కోడలు త్రిషా రెడ్డి నానిని గెలిపించాలంటూ ఓ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed