విషాదం.. షెడ్డు పైకప్పు కూలి ఇద్దరు రైతులు మృతి

by srinivas |   ( Updated:2024-12-04 11:32:58.0  )
విషాదం.. షెడ్డు పైకప్పు కూలి ఇద్దరు రైతులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షెడ్డు‌ పైకప్పు కూలి ఇద్దరు రైతులు మృతి చెందారు. మృతులు శివారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డిగా గుర్తించారు. పెడ్డు పైకప్పు నిర్మాణం నాసిరకంగా ఉండటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. షెడ్డు నిర్మించిన వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. షెడ్డును శివారెడ్డి ఇటీవల కాలంలో నిర్మించారని, అందులో పని చేస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు

Advertisement

Next Story

Most Viewed