- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరులో కుండపోత వర్షం
దిశ, డైనమిక్ బ్యూరో : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుఫాన్ ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ,గాలులు వీస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజలు భారీ వర్షం..ఈదురు గాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించాలని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో నెల్లూరు- కావలి వద్ద తీరం దాటనుండటం తో నెల్లూరు కు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండనున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి సహాయసహకారాలు అందించి అవసరం ఉన్న చోట్ల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జిలకు సూచించారు.