తిరుపతిలో ఘోర అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ

by Mahesh |
తిరుపతిలో ఘోర అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ
X

దిశ, వెబ్ డెస్క్: పవిత్రమైన తిరుమల తిరుపతి(Tirupati)లో ఘోర అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహా(Annamayya statue)నికి శాంతా క్లాజ్ టోపీ(Santa Claus hat) పెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన తిరుపతి పట్టణంలోని ప్రధాన కూడలిలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీని పెట్టి పారిపోయారు. కాగా ఉదయం స్వామి వారి విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ(Santa Claus hat) పెట్టి ఉండటం గమనించిన హిందూ సంఘాలు(Hindu communities) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు. కాగా ఈ సమాచారం అందుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు(Bajrang Dal activists) పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకొని.. హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని.. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కాగా రేపు క్రిస్మస్ పండుగ కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. పోలీసులు అప్రమత్తమై.. ఇటువంటి అపచారం చేసిన నిందితులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed