- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాసేపట్లో సీఎం జగన్ సభ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించిన విషయం తెలిసిందే. వైనాట్ 175 అంటూ 2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరులో ‘సిద్ధం’ సభ నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో సభ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. మైలవరం, పత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యేలు ఈ సభకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మూడు నియోజకవర్గాలకు సీఎం జగన్ కొత్త ఇంచార్జులను నియమించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నందున వాళ్లు దెందులూరు సిద్ధం సభకు డుమ్మా కొట్టారు. ఈ సభకు తాము హాజరుకామని ముందుగానే చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. మొత్తం 110 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేశారు. ఈ సభకు 50 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలను తరలిస్తున్నారు. మరికాసేపట్లో సీఎం జగన్ సభ ప్రాంగణానికి చేరుకుని ప్రసంగించనున్నారు. కీలక హామీలు ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విజయవంత చేయడం వల్ల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ సత్తా ఏంటో చూపించినట్లవుతుందని.. వచ్చే ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు ఈ సభ ఉమ్మడిపశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనాలు వేస్తున్నారు.