- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే!
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) రేపు(ఆదివారం) కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రేపటి నుంచి మూడు రోజులు(5,6,7 తేదీల్లో) సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం పర్యటన కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. డ్వాక్రా సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో పలు ప్రారంభోత్సవాలు, యువతతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవిడియన్ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమంలో పాల్గొననున్నారు. కుప్పంను 100 శాతం సోలార్ పవర్‌గా మార్చే ప్రణాళిక పై మాట్లాడనున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం పై పైలట్ పాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. కుప్పం పర్యటన ముగించుకుని ఈ నెల 8వ తేదీన ప్రధాని పర్యటన లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
Advertisement
Next Story