Ap: రెచ్చిపోయిన కబ్జాదారులు.. రెవెన్యూ సిబ్బందిపై కొడవళ్లతో దాడి

by srinivas |   ( Updated:2025-02-26 14:57:59.0  )
Ap: రెచ్చిపోయిన కబ్జాదారులు.. రెవెన్యూ సిబ్బందిపై కొడవళ్లతో దాడి
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamayya District) తట్టువారిపల్లి(Tattuvari Palli)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమి కబ్జా(Land Possession)ను అడ్డుకోబోయిన రెవెన్యూ అధికారుల(Revenue Officers)పై దాడి జరిగింది. అక్రమంగా భూమి కబ్జా చేసి కట్టడ్డాలు చేపడుతున్నారని స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలానికి అధికారులు వెళ్లారు. అయితే కబ్జాదారులు రెచ్చిపోయారు. రెవెన్యూ అధికారులపై కొడవళ్లతో దాడికి దిగారు. జేసీబీ(Jcb)ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు.

స్థానిక పోలీసులు(Police) సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై కేసులు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులు డిమాండ్ చేశారు. కబ్జాదారుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాలకు పాల్పడవద్దని కబ్జాదారుడికి గంటన్నరకు పైగా చెప్పామని, ఎంతకీ వినకపోవడంతో పిలిపించి, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని కబ్జాదారుడికి చెప్పామని తెలిపారు. ఇంతలో స్థలం కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తితో పాటు మరికొందరు తమపై దాడికి దిగారని పేర్కొన్నారు. ఈ దాడి విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) దృష్టికి తీసుకెళ్తామని స్థానిక రెవెన్యూ అధికారులు తెలిపారు. అయితే కబ్జాదారుడు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed