- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఎన్నికల వేళ కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ శ్రేణుల ఫైటింగ్
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ వాతావరణ నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కౌన్సిలర్ మణికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్.. మణిని ఆస్పత్రిలో పరామర్శించారు. టీడీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో గెలవలేక తమ పార్టీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
మరోవైపు కుప్పంలో టీడీపీ నుంచి చంద్రబాబు, వైసీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. దీంతో కుప్పంలో నియోజకవర్గంలో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఘర్షణలు చెలరేగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ ఎన్నికల్లో చాలా ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులు చేసుకునే అవకాశం ఉండటంతో మరింత భద్రత చర్యలు చేపట్టాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.