రేషన్ బియ్యం కేసులో ట్విస్ట్.. కంప్లైంట్ చేసిన వ్యక్తిపైనే అనుమానం

by srinivas |   ( Updated:2024-12-30 06:12:35.0  )
రేషన్ బియ్యం కేసులో ట్విస్ట్.. కంప్లైంట్ చేసిన వ్యక్తిపైనే అనుమానం
X

దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం(Ration Rice) కేసులో ట్విస్ట్ నెలకొంది. బియ్యం మాయం వెనుక కంప్లైంట్ చేసిన వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. బియ్యం మాయానికి సంబంధించి తనపై అనుమానం రాకుండా ఉండేందుకే కోటిరెడ్డి(Kotireddy) ఫిర్యాదు చేసినట్లుగా తేలింది. దీంతో కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే ఈ కేసులో ఇప్పటికే పేర్ని నాని గోడౌన్‌(Pernin Nani Godown) మేనేజర్ మానస తేజను అరెస్ట్ చేశారు. గోదాంలో బియ్యం నిల్వలు మాయం(Rice Stocks Destroyed) కావడంతో పేర్ని నానితో పాటు ఆయన భార్య జయ సుధ, కుమారుడు కిట్టుపైనా కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే వారంతా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు విచారణ జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ కేసుకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసిన కోటిరెడ్డినేనే అనుమానం రావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed