Vijayawada floods: బుడమేరు వాగు కట్ట తెగిందని వార్తలు.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు

by Mahesh |
Vijayawada floods: బుడమేరు వాగు కట్ట తెగిందని వార్తలు.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బుడమేరు వాగు కట్టకు గండ్లు పడటంతో బెజవాడలోని అనేక కాలనీలను వరద ముంచెత్తింది. దీంతో దాదాపు 10 రోజులకు పైగా ప్రజలు వరదల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి బుడమేరు వాగుకు మళ్లీ వరద వస్తుందని.. కట్ట తెగిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ వార్తలపై వెంటనే స్పందించిన మంత్రి నారాయణ బుడమేరు కట్ట మళ్లీ తెగిందనడం అవాస్తవమని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అలాగే ఇలాంటి వదంతులు ఎవరు నమ్మ వద్దని మంత్రి బెజవాడ ప్రజలకు సూచించారు.

ఏది ఏమైనప్పటికి బుడమేరు వాగు మరోసారి పొంగి కట్ట తెగిందనే వదంతులతో జిత్‌సింగ్‌ నగర్‌, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల జనం ఇళ్లనుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వస్తున్న పుకార్లు నమ్మొద్దు. బుడమేరుకు ఎలాంటి వరద రావడం లేదు. ఆకతాయిలు ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేసినట్లు గుర్తించాం. ఫేక్‌న్యూస్‌ ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సృజన తెలిపారు.

Advertisement

Next Story