- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics:‘అప్పటి నాటకాన్నే జగన్ మళ్లీ మొదలు పెట్టారు’ ..సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ శ్రేణులు నల్ల కండువాలతో వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిని అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులపై వైసీపీ పార్టీ సభ్యులు నిరసన తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు జైల్లో ఉన్నానని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో సీఎం మాట్లడారు. తప్పులు చేయడం ఇతరులపై నెట్టేయడం జగన్‌కు అలవాటని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కల్పించిన ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే కఠినంగా శిక్షిద్దాం అన్నారు. ‘వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలుపెట్టారు. వినుకొండ వ్యవహారంలో అదే కుట్ర చేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు విమర్శించారు. గంటన్నారపాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.