యుద్ధం ఇప్పుడే ప్రారంభం అయ్యింది: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై నారా లోకేశ్

by Seetharam |   ( Updated:2023-10-31 06:03:17.0  )
యుద్ధం ఇప్పుడే ప్రారంభం అయ్యింది: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా చంద్రబాబుకు నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంపై ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. భార్య నారా బ్రాహ్మణితో కలిసి నారా లోకేశ్ రాజమహేంద్రవరం చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయ్యిందని నాయకులు లోకేశ్ వద్ద ప్రస్తావించారు. దీంతో లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యిందని లోకేశ్ అన్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయ్యింది. నాలుగు వారాలపాటు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలను ఆయన తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా కోర్టులో ప్రస్తావించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చంద్రబాబు ఆరోగ్య సమస్య లు దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాలు పాటు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 28కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

Read More: బ్రేకింగ్.. సాయంత్రం నాలుగు గంటలకు జైలు నుంచి చంద్రబాబు విడుదల

Advertisement

Next Story