మా గ్రామంలో వైన్ షాప్ వద్దు..

by Vinod kumar |
మా గ్రామంలో వైన్ షాప్ వద్దు..
X

దిశ, ఉత్తరాంధ్ర: మా గ్రామంలో వైన్ షాప్ వద్దంటూ విశాఖ శివారు రామకృష్ణాపురం గ్రామస్థులు భీష్టించుకుని కూర్చున్నారు. నూతనంగా నిర్మించిన షాపులో అకస్మాత్తుగా వైన్ షాప్‌ను ఏర్పాటు చేసేందుకు కొంతమంది అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ వార్త ఆ నోటా.. ఈనోటా ఊరంతా తెలిసింది. ఒక్కసారిగా గ్రామస్థులు గ్రామ అధ్యక్షుడు వంకర బాబురావు, గ్రామ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకొని మధ్యం దుకాణం వద్దంటూ అడ్డుకున్నారు. గ్రామంలో చివర వేప చెట్టు దగ్గర ఓంశ్రీ సాయి సప్లయర్స్ షాపు వద్ద టెంట్ వేసి నిరసన తెలియచేశారు.

అసలు విషయం ఏంటంటే రామకృష్ణాపురం గ్రామానికి నిర్మించిన రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో ఈ గ్రామస్థులు ప్రజాప్రతినిధులపై గుర్రుగా వున్నారు. ఇక్కడి ఇళ్లకు స్లాబులు వేసేందుకు అనుమతి లేదు. కమ్యూనిటీ భవనం లేదు. స్మశాన వాటికకు ప్రహారీ నిర్మించాలని చానాళ్లుగా ఇక్కడివారు డిమాండ్ చేస్తున్నారు. కనీస వసతులు లేకున్నా మద్యం దుకాణం మాకెందుకని వ్యతిరేఖిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed