Nagarjuna Sagar:మళ్లీ తెరుచుకున్న నాగార్జునసాగర్ డ్యామ్..రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల

by Jakkula Mamatha |   ( Updated:2024-08-25 14:57:11.0  )
Nagarjuna Sagar:మళ్లీ తెరుచుకున్న నాగార్జునసాగర్ డ్యామ్..రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
X

దిశ,నాగార్జున సాగర్‌:నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు క్రస్టుగేట్లు ఈ ఎడాది మూడవసారి మళ్లీ తెరుచుకున్నాయి. ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సాగర్‌ క్రస్టుగేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఎగువ నుంచి వరద రాక తగ్గడంతో గేట్లను మూసివేశారు. వరద రాక స్వల్పంగా పెరగడంతో ఆదివారం ఉదయం 2 క్రస్టుగేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు స్వల్ప వదర కొనసాగుతుంది. 2 గేట్లు ఆరు అడుగుల మేర పైకి ఎత్తి 19,880 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్‌ ఫ్లో 66,329 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 66,329 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 590.00 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు వేశారన్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 312.0450 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 .0450 టీఎంసీలుగా కొనసాగుతుంది.శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌ జలాశయానికి 69,884 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయానికి వస్తున్న నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 312.0450 టీఎంసీలు ఉంది. జల విద్యుత్‌కు దిగువన కేంద్రం ద్వారా 29,191 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 8375 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7518 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కులు, లెవెల్‌ కెనాల్‌ ద్వారా 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. తొలుత బుధవారం సాయంత్రం రెండు గేట్లను ఎత్తిన అధికారులు గురువారం ఆరు గేట్లను తెరిచారు. ఐదు అడుగుల మేరకు గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 48 వేల 600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం ఇన్ ఫ్లో 95 వేల 469 క్యూసెక్కుల నీరు వస్తుంది. అంతే మొత్తంలో నీరు జలాశయం నుంచి ఔట్ ఫ్లో గా వెళ్తోంది. నాగార్జునసాగర్ జలాశయం ఇప్పటికే నిండు కుండలా ఉండగా మొత్తం నీటి మట్టం 590 అడుగులకు అంతే మొత్తంలో నిండింది. ఆగస్టు 5 నుంచి డ్యాం క్రస్టు గేట్లను ఎత్తి 12 తేదీ వరకు నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి తగ్గడం తో గేట్లను మూసివేశారు. మళ్లీ తాజాగా వరద ప్రభావం కొనసాగుతుండటంతో అధికరాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆదివారం ఉదయం ఐదు గంటలకు 2 గేట్లు ఎత్తడంతో సాగర్ వద్ద పర్యాటకుల సందడి మొదలైంది.

Advertisement

Next Story