- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Prakasam Barrage:ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి
దిశ,వెబ్‌డెస్క్: ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఢీకొన్న పడవల(boats) తొలగింపు పనులు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ముందుగా ఓ భారీ పడవను(huge boat) ముక్కలు చేయడం ప్రారంభించారు. విశాఖపట్నం(Visakhapatnam) నుంచి వచ్చిన డ్రైవింగ్ బృందం(Driving team) గంటల తరబడి నది లోపల 12 అడుగుల లోతుకి వెళ్లి బోటును గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేస్తూ వాటిని తొలగించేందుకు శ్రమించారు.
ఈ క్రమంలో రెండు బోట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage) వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఇప్పటికే రెండు బోట్లను(boats) తొలగించిన అధికారులు తాజాగా మూడో పడవను(boats) బయటికి తీశారు. వీటిని పున్నమి ఘాట్‌కు తరలించారు. ఈ ప్రక్రియకు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈ నెల 1న భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజీని ఢీ కొట్టాయి. వాటిలో ఒకటి దిగువకు కొట్టుకుపోగా, మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.