ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో రైతులు

by srinivas |
ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో రైతులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District) దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం(Pedda Bommalapuram)లో పెద్దపులి(Tiger) సంచారం కలకలం రేగింది. గండి చెరువు పరిసర ప్రాంత పొలాల్లో పులి తిరిగిన పాదముద్రలు కనిపించాయి. దీంతో అటవీశాఖ సిబ్బంది(Forestry staff) పాదముద్రలను పరిశీలించారు. రాత్రి సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే స్థానిక రైతులు(Farmers) ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు పశువులపైనా పెద్దపులి దాడి చేసిందని తెలిపారు. అడవిపందుల బెడద కూడా ఉందని పేర్కొన్నారు. బొప్పాయి, అరటి, మిరపపంటు పడిస్తామని, రాత్రి సమయంలో కాపల కాయాల్సి ఉందని, పులి సంచారంపై భయాందోళనలు వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారుు శాశ్వాత పరిష్కారం చూపాలని కోరారు.

Next Story

Most Viewed