- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం జీవో ఇచ్చిన.. ఆగని మధ్యవర్తుల హవా
దిశ, నెల్లూరు : జిల్లాలో రిజిస్ట్రేషన్ అధికారులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పూట కూడా రిజిస్ట్రేషన్లు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జల్లాలోని ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని ప్లాట్లు, వెంచర్ల రిజిస్ట్రేషన్ల కోసం రాత్రి 8 నుంచి 9 గంటలకు వరకు రిజిస్టేషన్ చేస్తున్నారు. ఒక్కో రిజిస్టేషన్‌కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తం చెల్లిస్తుండడంతో సబ్ రిజిస్ట్రార్లు కూడా 6 గంటలకు మాసివేయాల్సిన కార్యాలయాలను పొద్దుపోయే వరకు తెరిచి ఉంచుతున్నారు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులో వచ్చినప్పటికీ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తులు, రియల్ దళారుల హవానే నడుస్తోంది.
కాసులు కురిపిస్తేనే రిజిస్ట్రేషన్
జల్లాలోని దాదాపు అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినితీ రాజ్యమేలుతోంది. ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కావాలంటే అక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్లకు భారీగా ముడుపులు సమర్పిస్తున్నారు. అన్ని డాక్యుమెంటు్ల సక్రమంగా ఉన్నా పని త్వరగా జరగాలంటే రూ.10వేల నుంచి రూ.30వేల వరకు ముడుపులు సమర్పించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇంకా పెద్ద రిజిస్ట్రేషన్‌లకైతే రూ.లక్ష వరకు వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చే ముందుగా రైటర్లను, మధ్యవర్తలను కలిసి ముడుపులు చెల్లించుకుంటే ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇంత అవినీతి జరుగుతున్న అక్రమాలపై రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ శాఖలో అనాధికారికంగా జరుగుతున్న ఈ తంతుపై అధికారులు పట్టించుకోక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
పట్టించుకోని అధికారులు
డబ్బులు ముట్ట చెబితే అక్రమమైనా సక్రమంగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఫైళ్లపై సంతకాలు చేస్తూ తమకు రావలసిన మామూలు వస్తే చాలు అన్నట్టుగా రిజిస్ట్రార్లు కూడా వ్యవహారిస్తున్నారు. రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలో జరిగే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు, అనాధికార వ్యక్తులకు ప్రవేశం లేదని రిజిస్ట్రేషన్లు స్టాంపులశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్, గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ డాక్యుమెంట్ రైటర్లే అన్నీ తాముగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అయినా, అవినీతి మాత్రం ఆగకపోవడం విచారకరం.
- Tags
- nellore