- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News: అంతా ఊహించినట్టే జరిగింది...!
దిశ, వెబ్ డెస్క్: అంతా ఊహించనట్టే జరిగింది. ఆ మాజీ క్రికెటర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎవరో ఇప్పటికే అర్థమయి ఉంటుంది. ఆయన అంబటి తిరుపతి రాయుడు. కొంతకాలం ఇండియన్ క్రికెట్‌లో మ్యాచ్‌లు ఆడిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి ఇప్పుడు కొత్త ఆట మొదలుపెట్టారు. అదే పొలిటికల్ గేమ్. ఎప్పటి నుంచో పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వాలనే లక్ష్యంతో ఆయన వ్యూహాత్మంగా అడుగులు వేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన అంబటి తిరుపతి రాయుడు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఎప్పటినుంచో ఆకర్షితుడయ్యారు. సీఎం జగన్‌పై చాలా సార్లు ప్రశంసలు సైతం కురిపించారు. దీంతో వైసీపీలో అంబటి చేరతారని, గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని అంబటి ఖండించారు. ఇప్పుడే రాజకీయాల్లోకి రావడంలేదని దాటవేస్తూ వచ్చారు. ఆ తర్వాత అడపాదడపా వైసీపీ చేపట్టే కార్యక్రమాల్లో కనిపించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. చివరకు వైసీపీలో చేరాలని అంబటి ఫిక్స్ అయ్యారు.
ఈ మేరకు గురువారం మధ్యాహ్నం అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అంబటిని వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు.
— YSR Congress Party (@YSRCParty) December 28, 2023
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.#CMYSJagan#AndhraPradesh @RayuduAmbati pic.twitter.com/QJJk07geHL