పోటెత్తిన వరద..ఆ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఏలేరు

by Jakkula Mamatha |
పోటెత్తిన వరద..ఆ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఏలేరు
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains), తుఫాన్లు(Storms) కారణంగా ఆ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. విజయవాడ(Vijayawada)ను ఇప్పటికే వరద(Flood) నీరు ముంచెత్తడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో(Bay Of Bengal) ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరోసారి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కుంభవృష్టి వర్షాలు ఏకదాటిగా కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది(Godavari River) తీరానికి వరద నీరు అంతకంతకు పెరుగుతూ వస్తుంది. గోదావరితో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ జలాశయాలతో(Reservoir) మాత్రం పెను ముప్పే సంభవించింది.

కాకినాడ జిల్లాకు సంబంధించిన ఏలేరు ప్రాజెక్టుకు(Project) రికార్డు స్థాయిలో నీరు చేరడంతో వేలాది క్యూసెక్కుల నీటిని అధికార యంత్రాంగం విడుదల చేసింది. ప్రవాహ వేగానికి ఏలేరు సమీప బ్రిడ్జి సైతం కుంగిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. రాజుపాలెం వద్ద భారీ గండి పడింది. దీంతో పంట పొలాలతో పాటు ప్రధాన రహదారిపై ఆ నీరు పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో 8 మండలాలకు ముప్పు పొంచి ఉంది. మునిగిన ఇళ్లు, 25 వేల ఎకరాల్లో పంటలు మునక, పదికి పైగా కాలువలకు గండ్లు..వంతెనలు ధ్వంసం అయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

Next Story