‘తిరుమల లడ్డూ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వండి’.. టీటీడీ ఈవోను ఆదేశించిన సీఎం

by Jakkula Mamatha |   ( Updated:2024-09-20 11:01:58.0  )
‘తిరుమల లడ్డూ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వండి’.. టీటీడీ ఈవోను ఆదేశించిన సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వాడుతున్నారని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆరోపణలతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లడ్డూ వివాదం విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కల్తీ నెయ్యి ఆరోపణలపై వైసీపీ హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో, సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వ్యవహారంపై మంత్రులు, అధికారులతో ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. ఈ సాయంత్రం లోపు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed