AP News:పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..భారీగా కోళ్లు మృతి

by Indraja |
AP News:పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..భారీగా కోళ్లు మృతి
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ప్రతి ఏడాది విదేశీ పక్షులు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోవారి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు వలస వస్తాయి. ఈ ఏడాది కూడా విదేశీ పక్షులు అలానే వలస వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటగా నెల్లూరు జిల్లా లోని కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. దీనితో ఆ ప్రాంతాల్లో కోళ్లు భారీగా మృత్యువాత పడ్డాయి.

అయితే తీవ్ర స్థాయిలో కోళ్లు చనిపోవడంతో అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలాలను పరీశీలించి తగిన చర్యలు తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ భారిన పడిన ప్రాంతాలకు కిలోమీటర్ మేర చికెన్ షాపులను మూసివేశారు. అయితే బర్డ్ ఫ్లూ అతివేగంగా ప్రబలుతోంది. నెల్లూరులో కొన్ని ప్రాంతాల్లో మొదలైన వ్యాధి శరవేగంగా పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా జిల్లాలకు పాకింది. దీనితో అప్రమత్తమైన ప్రబుభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది.

పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటుగా విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు,ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసింది. కాగా రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కోళ్లు, విదేశీ పక్షుల రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమ్మితం ల్యాబ్ కు పంపిస్తున్నారు. శరవేగంగా ప్రబలుతున్న బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు ఆందోళనచెందుతున్నారు.

Advertisement

Next Story