ఈ రాష్ట్రంలో అతి పెద్ద రోగిస్టు చంద్రబాబు: మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

by Seetharam |
ఈ రాష్ట్రంలో అతి పెద్ద రోగిస్టు చంద్రబాబు: మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఈ రాష్ట్రంలో అతి పెద్ద రోగిస్టు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు తనకు అనేక వ్యాధులు ఉన్నాయి అని కోర్టును కోరితే కోర్టు వారు బెయిల్ మంజూరు చేశారని తెలిపారు. చంద్రబాబు ఒక దొంగ.. ప్రజల డబ్బులు దోచేసేసాడు అని ఆరోపించారు. దొంగ బయటకు వస్తే ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉండదని హెచ్చరించారు. 40ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు సింపతీ కోసం ఒక గేము ఆడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పట్లో బయటపడే అవకాశాలు లేవని విమర్శించారు. ప్రజల గుండెలలో ఉండే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గురువారం మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఇళ్లలో ఉన్న పార్టీ వైసీపీ అని చెప్పుకొచ్చారు. నారా లోకేశ్ వల్ల కాక పురంధేశ్వరి బయటకు వచ్చి చంద్రబాబు కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నానిపైనా సెటైర్లు వేశారు. విజయవాడ నియోజకవర్గం అభివృద్ధిని ఎంపీ కేశినేని నాని గాలికి వదిలేశారని విమర్శించారు. ముఖ్యంగా 48వ డివిజన్ పై ఎంపీ దృష్టి కరువు అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.

Advertisement

Next Story