- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaravati: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ... చర్చించే అంశాలివే..!
దిశ , వెబ్ డెస్క్: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మిచౌంగ్ తుఫాను, పంట నష్టం, ప్రభుత్వ సహాయ, పునరావాస కార్యక్రమంపై చర్చించనున్నారు. వీటితో పాటు పెన్షన్ పెంపు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ అసరా నిధుల విడుదలపైనా చర్చించే అవకాశం ఉంది. సచివాలయంలో బ్లాక్ -1లో ఈ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.
కాగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జగన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే పార్టీలో పలు మార్పులు చేసింది. 11 నియోజకవర్గాలకు ఇంచార్జులను మార్పు చేసింది. ఇక సంక్షేమ పథకాల విషయంలోనూ దూకుడు పెంచింది. ఇప్పటికే 90 శాతం హామీలు నెరవేర్చామని చెబుతోంది. ఇంకా అర్హులు ఉంటే వారికీ సంక్షేమ పథకాలు అందించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం జరగబోయే కేబినెట్ భేటీ తర్వాత పలు కీలక తీసుకునే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.