రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్

by sudharani |
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానం, హోంశాఖ మంత్రి తానేటి వనిత, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కే రోజా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌‌పర్సన్‌ లక్ష్మీపార్వతి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మరోవైపు మన సంస్కృతిని- మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను- విజయాలను, ఈ నేల పై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed