కౌతాళంలో లోకేష్ జన్మదిన వేడుకలు.. టీడీపీ యువనేత పై పాలకుర్తి ప్రశంసలు

by Indraja |
కౌతాళంలో లోకేష్ జన్మదిన వేడుకలు.. టీడీపీ యువనేత పై పాలకుర్తి ప్రశంసలు
X

దిశ వెబ్ డెస్క్: ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ జన్మదినం. ఈ నేపధ్యలో ఇటు రాష్ట్రం లోనూ అటు విదేశాల్లోనూ నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా లోని న్యూయార్క్ నుండి ఆంధ్రలోని కుప్పం వరకు లోకేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ తారాస్థాయిలో జరిగాయి. అయితే తాజాగా కర్నూలు జిల్లా లోని మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పుట్టిన రోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి పాలకుర్తి తిక్కారెడ్డి కేక్ కట్ చేశారు.

అనంతరం నారా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ పై ప్రశంసల జల్లు కురిపించారు. నారా లోకేష్ బాబు భవిష్యత్ గురించి విజన్ కలిగి ఉన్న నాయకుడని కొనియాడారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి లేక యువత, అలానే సరైన సదుపాయాలు లేక రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకునేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని. ఇప్పుడు ఆయన చేస్తున్న పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తారని తెలిపారు. ఇక నారా లోకేష్ జీవితంలో ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనదంగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story