- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోతిన మహేష్ రాజకీయ జీవితం నాశనం కావడానికి కారణం అదే.. స్వాతి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కారణంగా పోతిన మహేష్ రాజకీయ జీవితం నాశనమయ్యిందంటూ టీడీపీ సోషల్ మీడియా నేత స్వాతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కూటమిలో సీట్ల పంపకంలో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి ఇచ్చిన కారణంగా పోతిన మహేష్ సీటు కోల్పోయాడని అన్నారు. సీటు ఇవ్వని కారణంగా మహేష్‌కు అన్యాయం జరిగిందని, ఈ క్రమంలో మహేష్ కు సానుభూతి పెరిగిందని తెలిపారు. సీటు రాకున్నా పవన్ కళ్యాణ్ విధేయుడిగా ఉండుంటే అధికారంలోకి వచ్చాక అతనికి సరైన గుర్తింపు దక్కుండేది. కాదనుకుని, పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తూనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నా గెలిచేవాడని తెలిపారు. కానీ సీటు రాలేదని అక్కసుతో జగన్‌తో టచ్‌లోకి వెళ్ళాడు. ఏ పార్టీ అభ్యర్థైనా వైసీపీలో చేర్చుకోవాలంటే జగన్ పెట్టే మొదటి కండీషన్ అతను గతంలో పని చేసిన పార్టీ అధినాయకుడిని తిట్టించడమని స్వాతిరెడ్డి, జగన్ పై విమర్శలు చేశారు. ఈ క్రమంలో పోతిన మహేష్ ను పార్టీలో చేర్చుకునే ముందు అతనితో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేపించి పర్సనల్ గా తిట్టించాడన్నారు.
100% వైసీపీ స్క్రిప్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా భార్య గురించి కూడా మాట్లాడించాడని వెల్లడించారు. ఆ విమర్శలు విన్న పవన్ అభిమానుల్లో ఆవేశం కట్టలు తెంచుకుందని, మహేష్ ను అభిమానించిన పవన్ అభిమానుల్లో మహేష్ మీద సానుభూతి పోయి ధ్వేషంగా మారిందన్నారు. అతనికి మద్దతు ఇవ్వాలనుకున్న జనసైనికులు, కూటమి పార్టీల అభిమానులు కూడా మహేష్ కు మద్దతు ఉపసంహరించుకుని అతని విమర్శలు చర్యలుపై ప్రతి విమర్శలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పోతిన మహేష్ వైసీపీలో చేరిన ఒంటరని, అతని వెంట జనసేన క్యాడర్ ఎవ్వరూ వెళ్ళలేదని, అతనికి ఒక్కరు కూడా మద్దతు తెలపలేదని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో ప్రజా సేవ ద్వారా సంపాదించుకున్న పేరు మొత్తం జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ మీద పర్సనల్‌గా విమర్శలు చేసిన కారణంగా పోగొట్టుకున్నాడని వెల్లడించారు. మొత్తానికి సైకో జగన్‌తో చేతులు కలిపి జగన్ లాగా చెడ్డ పేరు తెచ్చుకున్నాడన్నారు. ఇక ఇక్కడితో పోతిన మహేష్ రాజకీయ జీవితం ముగిసిందని చెప్పుకోవచ్చని’’ అని స్వాతి రెడ్డి చెప్పుకొచ్చారు.
Read More..
Ap Politics:సీఎం జగన్ పాలనంతా అంకెల గారడీలు,అబద్ధాలే: మాజీ మంత్రి