అత్యంత విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి

by Nagaya |   ( Updated:2023-01-31 04:52:21.0  )
అత్యంత విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి
X

దిశ, వెబ్‌డెస్క్ : టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అర్జునుడికి ఆదివారం ఉదయం గుండెపోటు రాగా విజయవాడలోని రమేశ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి లైఫ్ సేవింగ్ సపోర్ట్‌తో అర్జునుడికి చికిత్స అందిస్తున్నట్టు చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేశ్ బాబు తెలిపారు. ఎమ్మెల్సీ అర్జునుడికి అనెస్థీషియా వైద్యుడు డాక్టర్ పి.శ్రీనివాస్, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ధరణేంద్ర, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేశ్, న్యూరాలజిస్ట్ డాక్టర్ కుమారవేలు, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ లక్ష్మీ అనూష అనుక్షణం పరవేక్షిస్తూ వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

Also Read...

Nandamuri Taraka Ratna's health update :తారకరత్న హెల్త్ తాజా అప్ డేట్!

Advertisement

Next Story