- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీ అధిష్టానం పునరాలోచించాలి.. కార్యకర్తల హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ జనసేన సీట్లను ప్రకటించగా, టికెట్లు ఆశించి బంగపడ్డ ఇరు పార్టీల నేతలు ఆయా పార్టీల అధిష్టానాలపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకి కేటాయించడంపై తెనాలి టికెట్ ఆశించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనుచరులు బగ్గుమంటున్నారు. తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర కుల మతాలకు అతీతంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని, ఎంతో మందికి ఫెన్షన్లు, పెళ్లి కానుకలు ఇస్తున్నారని, నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తారని తెలిపారు.
అలాగే 20019 లో ఓడిపోయినా పార్టీకే అంకితం అయ్యి టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే కార్యకర్తలు కూడా పార్టీని, ఆలపాటిని నమ్ముకొని ఉన్నామని అధిష్టానం కార్యకర్తలకు గౌరవం ఇవ్వదా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీని నమ్ముకొని ఉన్న నాయకుడికి టికెట్ కేటాయించకపోవడం సరికాదని టికెట్ టీడీపీ అధిష్టానం పునరాలోచించుకొని సీటు ఆలపాటికి ప్రకటించాలని హెచ్చరిస్తున్నారు.
గుంటూరు జిల్లా టీడీపీలో సీనియర్ నేతల అయిన ఆలపాటి గత ఎన్నికల్లో తెనాలి నుండి ఓడిపోయినా కూడా పార్టీలోనే కొనసాగుతూ.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు వస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి తెనాలి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు టికెట్ జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ కి కేటాయించడంతో పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తొంది. ఇదివరకే టికెట్ అంశంపై అధిష్టానం నుంచి కబురు వచ్చిందని, తెనాలి కాకుండా మరోసీటు ఇస్తామని చెప్పినట్లు పలు వార్తలొచ్చాయి. దీనిపై ఆలపాటి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పడు తెనాలి సీటు జనసేనకి కేటాయించడంతో.. అధిష్టానం చెప్పినట్లుగా వేరే స్థానం నుంచి పోటీ చేస్తారా లేక వేరు కుంపటి పెట్టే ఆలోచన ఏమైనా ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది.