- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ ప్రజల్లోకి చంద్రబాబు.. ఆ పేరుతోనే వెళ్లాలని నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. మే 13న రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో ఆయన మరింత స్పీడ్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు భాగంగా ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చేపట్టిన ‘ప్రజాగళం’ సభ సక్సెస్ కావడంతో తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రజాగళం’పేరుతోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అయితే టీడీపీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసిన తర్వాతనే ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 16 మందిని ఫైనలైజ్ చేస్తే అసెంబ్లీ అభ్యర్థుల అంశం ముగిసిపోతుంది. ఒకటి రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థులను సైతం ప్రకటించనున్నారు. దీంతో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి దిగాలని కసరత్తులు చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో తమను ఆశీర్వదించాలని డైరెక్ట్‌గా ప్రజల వద్దకే వెళ్లి అడగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు చేపట్టే ప్రజాగళం పర్యటనకు పార్టీ నేతలు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.