- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
జైల్లో చంద్రబాబుకు అనారోగ్యం.. టీడీపీ సంచలన నిర్ణయం..!
దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర ఎండల కారణంగా డీహైడ్రేషన్‌కు గురవ్వడంతో పాటు స్కీన్ ఎలర్జీ వంటి సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. చంద్రబాబుతో ఇవాళ ములాఖత్ అయిన లోకేష్, భువనేశ్వరి సైతం బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖం, కాళ్లు, చేతులపై దద్దర్లు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ములాఖత్ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. నారా భువనేశ్వరి భర్తను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరుఫున లాయర్లు పిటిషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్‌లను కోర్టుకు సమర్పించి.. మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ మేరకు పిటిషన్‌ను చంద్రబాబు లాయర్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏసీబీ కోర్టుకు ఇవాళ, రేపు సెలవులు కావడంతో ఏం చేయాలనే అంశంపైన న్యాయవాదులు చర్చలు జరుపుతున్నారు.