AP News:ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి

by Jakkula Mamatha |
AP News:ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి
X

దిశ, ధర్మవరం రూరల్:జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతిరోజు దినసరి వేతనం రూ.300 లు వచ్చే విధంగా కొలతల ప్రకారం పనిచేయాలని ద్వామా పిడి విజయప్రసాద్ ఉపాధి కూలీలకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని నిమ్మలకుంట గ్రామం చింత వనంలో జరుగుతున్న చింత-నిశ్చింత పనులను, చింత చెట్ల చుట్టూ తవ్వుతున్న నీటి కందకాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం చింత వనంలో చేస్తున్న పనుల వలన వర్షపు నీటిని ఆదా చేసుకోవడంతో పాటు చెట్లు ఏపుగా పెరిగి గుడికి కూడా ఆదాయం వస్తుందన్నారు. ముఖ్యంగా పండ్ల తోటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీవో అనిల్‌ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ చంద్రకళతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story