- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
N. Chandrababu Naidu కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టులో లక్ష్మీపార్వతికి షాక్
దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ నేత లక్ష్మీపార్వతి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలంటూ లక్ష్మీపార్వతీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే ఈ పిటిషన్‌ను కొట్టివేసిందని పేర్కొంది. ఈ సందర్భంగా ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీకు ఉన్న అర్హత ఏమిటి అని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ప్రశ్నించగా తాను మాజీ ముఖ్యమంత్రి భార్యను, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని లక్ష్మీపార్వతి తరపు న్యాయవాది చెప్పగా అదేమన్నా అదనపు అర్హతనా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతివాది ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రిగా పని చేశారని, అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని లక్ష్మీపార్వతి తరపు న్యాయవాది వాదించగా అది ఎక్కడైనా రుజువైందా? అలాంటి ఆరోపణకు మీరు సాక్ష్యాలు చూపలేదు కదా అని ధర్మాసనం పేర్కొంది. ఒకరి ఆస్తులు గురించి తెలుసుకునే అర్హత మీకు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రతివాది ఎన్నికల సంఘానికి తన ఆస్తుల వివరాలు సమర్చించారని ఈ విషయం ఈసీ చూసుకుంటుందని ఇందులో మీకు ఉన్న అభ్యంతరం ఏంటో అర్థం కావడం లేదని పేర్కొంది. ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి అతని ఆస్తులు గురించి బయటికి తెలియాల్సి ఉందని న్యాయవాది చెప్పగా ఎవరి ఆస్తుల గురించి ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటు పిర్యాదు పిటిషన్ దాఖలు చేసే అర్హత మీకు లేదు అని లక్ష్మీపార్వతికి స్పష్టం చేస్తూ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది.
ఇవి కూడా చదవండి :
Delhi Liquor Scam: 'లిక్కర్ స్కాంలో కవితతో పాటు రేవంత్ రెడ్డి హస్తం'