- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సారీ.. మేం ఇప్పుడు విచారించలేం.. తెలంగాణ హైకోర్టులోనే ట్రై చేయండి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అడ్మిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నిబంధనను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించి తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు విచారిస్తూ ఉన్నదని, ఇంకా తుది తీర్పును వెలువరించలేదని గుర్తుచేసింది.
తాజాగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలు కూడా ఆ ఇష్యూకి సంబంధించినవే అయినందున హైకోర్టునే ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. ఒకవేళ తీర్పు వెలువరించడానికి జాప్యం జరుగుతున్నదని భావించినట్లయితే సత్వర విచారణ జరిపించాలని ప్రత్యేకంగా రిక్వెస్టు చేయవచ్చని నొక్కిచెప్పింది. ఒకేసారి అటు హైకోర్టులో.. ఇటు సుప్రీంకోర్టులో సమాంతర విచారణ జరగడం సమంజసం కాదని స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పూర్వం నుంచే ఉనికిలో ఉన్న మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని, గడచిన తొమ్మిదేండ్లలో కొత్తగా ఏర్పడిన కాలేజీల్లో మాత్రం 100% సీట్లు తెలంగాణ స్థానికత ఉన్నవారికి మాత్రమేనంటూ రాష్ట్ర ప్రభుత్వం జూలై ఫస్ట్ వీక్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల కారణంగా తమకు తెలంగాణ కాలేజీలో అడ్మిషన్లు దొరకే అవకాశాలు లేకుండా పోయాయని ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న ఆరుగురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 21 నిబంధనలకు విరుద్ధమే కాక ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. దీన్ని విచారించిన హైకోర్టు ఆ ఆరుగురు విద్యార్థులకు రిలీఫ్ ఇచ్చింది.
దీన్ని దృష్టిలో పెట్టుకున్న మరికొద్దిమంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఆరుగురు విద్యార్థులకు మాత్రమే ఉపశమనం కలిగించిందని, తమలాంటివారికి రిలీఫ్ లేదని పేర్కొన్నారు.