- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైభవం..శ్రీశైల బ్రహ్మోత్సవం
దిశ, శ్రీశైలం : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఐదో రోజు బుధవారం భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు,వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తీసుకెళ్లారు. అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా స్వామి వారిని దర్శించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
స్వామి వార్లకు పట్టువస్త్రాలు
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వీరికి శ్రీశైలం ఆలయ ఈవో ఎస్ లవన్న, చైర్మన్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్ టువస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన ర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవార్ల శేష వస్త్రాలతో నాయకులను సత్కరించి లడ్డు ప్రసాదాలను అందించారు.