- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srisailam Dam: నిండుకుండలా మారిన శ్రీశైలం.. గెట్లు ఎత్తడానికి అధికారులు సన్నాహాలు
దిశ, వెబ్ డెస్క్: తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు ప్రాజెక్టులకు వారం రోజుల నుంచి భారీ వరద వచ్చి చేరుతుంది. భారీ వరద కారణంగా రెండు డ్యాములు వచ్చిన నీటి వచ్చినట్లే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి భారీ వరద వచ్చి చేరుతుంది. రెండు ప్రాజెక్టుల నీటిని కిందకు వదలడంతో.. 4,34,483 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతుంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం.. 873 అడుగులకు చేరింది.
దీంతో ఎగువ నుంచి వస్తున్న భారీ వరద డ్యాం పూర్తి స్థాయి సామర్ధ్యానికంటే ఎక్కువ ఉండటంతో.. రెండు రోజుల్లో గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజులు సాగర్ కు శ్రీశైలం విద్యుత్ కేంద్రాల నుంచి 54 వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది. కాగా సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు, అంటే శ్రీశైలం సామర్థ్యం కంటే దాదాపు 100 టీఎంసీలు ఎక్కువ. కాబట్టీ ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వస్తున్న పూర్తి వరదను సాగర్ కు విడిచిపెడితే కేవలం 70 శాతం డ్యాం మాత్రమే నిండుతుంది.