- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరుకు చంద్రబాబు.. జోన్ సమీక్ష సమావేశంలో దిశా నిర్దేశం
దిశ, నెల్లూరు: శుక్రవారం జరిగే జోన్ సమీక్ష సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరుకు రానున్నారు. 35 నియోజకవర్గాల క్లస్టర్, యూనిట్ ఇంఛార్జిలకు పార్టీ కార్యక్రమాలపై ఆయన దిశా నిర్దేశం చేస్తారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగరంలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న వేణుగోపాలస్వామి కళాశాల వద్ద ఉన్న సమావేశ స్థలాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఉన్నారు. జోన్ - 4 పరిధిలో ఐదు పార్లమెంటు నియోజకవర్గాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, ఒంగోలు, వాటి పరిధిలో ఉన్న 35 అసెంబ్లీ నియోజకవర్గాలలోని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులతో చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎలా చేరువవ్వాలి. ప్రజా సమస్యల పై ఎలా పోరాడాలనే అంశాల పై దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు..
Read more:
ఇవాళ నేను విఫలం కావొచ్చు.. రేపు తప్పక విజయం సాధిస్తా: పవన్ కల్యాణ్ (వీడియో)