- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: ఏపీ ఇరిగేషన్ శాఖలో రూ. 200 కోట్ల స్కాం..!
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజవకవర్గం ఇరిగేషన్ శాఖలో రూ. 200 కోట్ల భారీ స్కాం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులు చేయకుండానే వైసీపీ నేతలు నిధులు స్వాహా చేశారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రబాబు మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కంపేట, వీరంపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న ఇరిగేషన్ పనులను పరిశీలించిన ఆయన ఒకే పనికి ఒక్కో ఏడాది నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. 5 ప్యాకేజీల ద్వారా నిధులు దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలకు రైతులు మొదటి పంట సాగు చేయలేకపోయారని తెలిపారు. మొత్తం మూడు లక్షల ఎకరాల్లో పంట పండించలేకపోయారని తెలిపారు. జగన్ ఇసుక, మద్యం, ఖనిజాలు దోచుకున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా దోచుకుతిన్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒత్తడి చేయడం వల్లే బిల్లులు చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారన్నారు. సర్వేపల్లిలో జరిగిన అక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్లామని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు