Nellore: గురుకుల పాఠశాలలో చదువుకోవాలని ఉందా.. ఇలా చేస్తే చాలు!

by srinivas |   ( Updated:2023-04-17 16:10:24.0  )
Nellore: గురుకుల పాఠశాలలో చదువుకోవాలని ఉందా.. ఇలా చేస్తే చాలు!
X

దిశ, నెల్లూరు: 2023 -24 విద్యా సంవత్సరానికి ఏపీ గురుకుల పాఠశాలలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మే నెల 20న గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారని నెల్లూరు జిల్లా గండిపాళెం ప్రభుత్వ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో విద్యను అభ్యసించాలనే ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 24 నుంచి ఏపీఆర్ఎస్ డాట్, ఏపీసీఎఫ్ఎస్‌డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2023-24 విద్యాసంవత్సరానికి గాను నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 5, 6 ,7, 8 తరగతులలో ఖాళీలను భర్తీ చేయుటకు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.

Advertisement

Next Story