Skill Scam: బాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ..

by Shiva |   ( Updated:2024-02-12 14:09:08.0  )
Skill Scam: బాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ..
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులు విచారణ జరగనుంది. ఈ మేరకు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌ ధర్మాసనం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. అయితే, కేసులో చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ కోర్టుకు అందజేసిన పిటిషన్‌లో తెలిపింది.

ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని వాదనను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ కోరుతోంది. కాగా, జనవరి 19న విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు సమయం కావాలని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.

Read More..

Breaking: శంఖారావం సభలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story