టీడీపీ నేత అబ్ధుల్ అజీజ్‌కు షాక్.. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

by Seetharam |
టీడీపీ నేత అబ్ధుల్ అజీజ్‌కు షాక్.. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్ధుల్ అజీజ్‌కు షాక్ తగిలింది. అబ్దుల్ అజీజ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అబ్దుల్ అజీజ్‌కు సీఐ రాములు నాయక్ కు వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనపై సీఐ రాములు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలాజీ నగర్ సీఐ రాములు నాయక్ ఫిర్యాదు మేరకు POA యాక్ట్ ఐపీసీ సెక్షన్ 290, 353, 3(1)(r)(s) కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు అబ్దుల్ అజీజ్ కు 41 (ఏ) సీఆర్పీసీ నోటీసును బాలాజీ నగర్ ఎస్ఐ సుభానీ అందజేశారు. అబ్ధుల్ అజీజ్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీకేసు నమోదు కావడం, ఎస్ఐ నోటీసులు ఇవ్వడం జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story