- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మళ్లీ కాంగ్రెస్‌తోనే సాధ్యం: షర్మిల
దిశ, వెబ్‌డెస్క్: పక్కా వ్యూహంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు వైఎస్ఆర్ కూతురు షర్మిలకు అప్పగించింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వరుస సమావేశాలు జరుపుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నది స్వయంగా తన సోడురుడే అయినా ఏమాత్రం ఆలోచించకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ‘ఇందిరమ్మ అభయం’ పేరుతో మొదటి గ్యారంటీని ప్రకటించింది.
ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం పట్టణంలో ఏపీసీసీ నిర్వహించిన ‘న్యాయ సాధన సభ’ భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆమె ఈ ప్రకటన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పునాదులు వేసిందని అన్నారు. మెట్టు మెట్టు కట్టుకుంటూ నిర్మాణం చేసిందని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ ప్రకటించిన పథకం ప్రతి ఇంటికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో పది అడుగులు కూడా ముందుకు పడలేదని షర్మిల అన్నారు.