ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Javid Pasha |   ( Updated:2023-10-28 12:49:09.0  )
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త అందింది. విజయవాడలో రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విజయవాడలోని బందర్ రోడ్డులో ఈ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రీజనల్ పాస్ పోర్ట్ కేంద్రంకు అదనంగా మరో రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు కానుందని ఆఫీసర్ శివ హర్ష స్పష్టం చేశారు.

విజయవాడలో రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ ఏర్పాటు వల్ల త్వరగా సేవలు అందుతాయని రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష తెలిపారు. పాస్‌పోర్ట్ ప్రింటింగ్ కూడా ఇక్కడ నుంచే జరుగుతుందని, దీని వల్ల త్వరగా జారీ ప్రక్రియకు వీలవుతుందని అన్నారు. కరోనా ప్రభావం తగ్గిన పాస్‌పోర్ట్‌లకు దరఖాస్తుల సంఖ్య బాగా పెరిగిందని, పోస్టల్, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరగా పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తున్నట్లు చెప్పారు.

Read More..

ఏపీలో రేషన్ కార్డు ఉన్నోళ్లకు తీపికబురు

Advertisement

Next Story