కృష్ణా నదిలో సీ ప్లేన్ ట్రయల్ రన్..!

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-28 08:16:12.0  )
కృష్ణా నదిలో సీ ప్లేన్ ట్రయల్ రన్..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో సీ ప్లేన్ పై ట్రయల్ రన్(Sea plane trial run) నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారెజీ నుండి శ్రీశైలం (Vijayawada to Srisailam) వరకు సీ ప్లేన్ సర్వీస్ నడపనున్నారు. ఇప్పటికే పర్యాటక శాఖ శ్రీశైలంలో కృష్ణానదిపై పాతాళగంగ వద్ద ల్యాండింగ్ పాయింట్ గుర్తించింది. వచ్చే నెల 9వ తేదీన సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజకుమారి, పర్యాటక శాఖ అధికారులు పాతాళ గంగ వద్ద ల్యాండింగ్ పాయింటును పరిశీలించారు. వాటర్ ఏరో డ్రోమ్ లలో సీ ప్లేన్ టేకాఫ్, ల్యాండింగ్ నిర్వహిస్తారు. సీ ప్లేన్ టూరిజం విస్తరణకు నియమావళిని కేంద్ర పౌర విమాన శాఖ సరళీకరించింది.

దేశంలో మూడేళ్ళలో 100మార్గాల్లో సీ ప్లేన్ సర్వీస్ లను నడిపేందుకు కేంద్రం సన్నహాలు చేస్తోంది. కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు సీ ప్లేన్ విధివిధానాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఆరేళ్ల క్రితం పున్నమి ఘాట్ వద్ద సీఎం చంద్రబాబు సీ ప్లేన్ లో విహరించిన సందర్భంగా ఏపీకి సీ ప్లేన్ తీసుకొస్తామని ప్రకటించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలో వచ్చిన క్రమంలో సీ ప్లేన్ ప్రాజెక్టును పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed