యువగళం కాదు టీడీపీకి మంగళం : రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి R K Roja

by Sumithra |   ( Updated:2023-01-23 10:14:10.0  )
యువగళం కాదు టీడీపీకి మంగళం : రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి R K Roja
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేశ్ సైతం నడుం బిగించారు.

ఇందులో భాగంగా ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 'యువ గళం' పేరుతో ప్రారంభం కాబోతున్న ఈ పాదయాత్ర ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభంకానుంది. ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ సైతం ఖరారైపోయింది. అయితే లోకేశ్ పాదయాత్ర పై ఇప్పటికే వైసీపీ తీవ్ర సెటైర్లు వేస్తోంది. ఇక లోకేశ్‌పై విమర్శలు చేసేవారిలో మాజీమంత్రి కొడాలి నాని, మంత్రి ఆర్‌కే రోజా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేశ్‌ను పప్పు అంటూ ఘాటు విమర్శలు చేసే ఆర్‌కే రోజ.. లోకేశ్ పాదయాత్రపై చెడుగుడు ఆడేసుకున్నారు.

పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో లోకేశ్‌కు తెలుసా అంటూ సెటైర్లు వేశారు. అక్కడితో ఆగిపోలేదు అది'యువ గళం'కాదు... తెలుగుదేశం పార్టీకి 'మంగళం' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ఎన్నికల ప్రచారం చేసిన ప్రతీ చోట టీడీపీ ఓడిపోయిందని ఇక పాదయాత్రతో టీడీపీ దుకాణం మూతపడినట్లేనని మంత్రి ఆర్‌కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి : ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ .. వారం రోజులే డెడ్‌లైన్

Advertisement

Next Story

Most Viewed