మొదలైన సంక్రాంతి సందడి.. రెడీ అవుతున్న పుంజులు!

by GSrikanth |
మొదలైన సంక్రాంతి సందడి.. రెడీ అవుతున్న పుంజులు!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. ఊర్లలో ఈ పండుగను ఎంత అద్భుతంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పండుగను అయినా లైట్ తీసుకుంటారేమో కానీ, సంక్రాంతిని మాత్రం ఎవరూ లైట్ తీసుకోరు. ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డా.. సంక్రాంతికి ఊరికి రావాల్సిందే. ముఖ్యంగా ఈ పండుగ వేళ జరిగే కోడి పందేలా ఆటకు సపరేట్ క్రేజ్ ఉంటుంది.

మూడు నెలల ముందే కోళ్లకు శిక్షణ ఇచ్చి పండక్కి సిద్ధం చేస్తుంటారు. వాటికి పెట్టే ఫుడ్‌లో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. మటన్, గుడ్డు, బాదం, ఎండు ఖర్జూరం వంటివి వాటికి మెనూలో పెడుతుంటారు. ఒక్కో పుంజుపై ఏకంగా రూ.25 నుంచి రూ.30 వేలు ఖర్చు చేస్తుంటారు. ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లో ఈ పండగను గ్రాండ్‌గా చేసుకుంటారు. ఈ కోడి పందేలను చూడ్డానికి తెలంగాణ నుంచి భారీగా వెళ్తుంటారు. తాజాగా.. పండుగ సమీపిస్తుండటంతో కోళ్ల పందేలకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed