YS Jagan ధర్నా ఎఫెక్ట్.. ఢిల్లీలోని ఏపీ భవన్ గేట్లు మూసివేత..!

by Satheesh |   ( Updated:2024-07-24 04:23:21.0  )
YS Jagan ధర్నా ఎఫెక్ట్.. ఢిల్లీలోని ఏపీ భవన్ గేట్లు మూసివేత..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ దగ్గర అధికారులు ఆంక్షలు విధించారు. ఏపీ భవన్ గేట్లు మూసివేసి భవన్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నిషేధాజ్ఞలు అమలు చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని.. వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఇవాళ (బుధవారం) ధర్నా చేపట్టాలని జగన్ నిర్ణయించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోడీ, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడుల ఫొటోలు, వీడియోలను గ్యాలరీ రూపంలో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఇటీవల పల్నాడు జిల్లాలోని వినుకొండలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు నిరసనగా ఢిల్లీలో ఆందోళన చేపడతామని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ (బుధవారం) రాజధానిలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా కాగా ధర్నాకు ఆంక్షలు విధించి అధికారులు జగన్‌కు షాక్ ఇచ్చారు. నిషేదాజ్ఞలు అమలులో ఉన్న నేపథ్యంలో జగన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story