ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఊరట.. వాటిని తీసుకెళ్లేందుకు అనుమతి

by Javid Pasha |   ( Updated:2023-09-10 17:02:12.0  )
ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఊరట.. వాటిని తీసుకెళ్లేందుకు అనుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూంతో పాటు ఇంటి భోజనం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై న్యాయవాది నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక వసతి కల్పించాలని ఆదేశించారు.

అలాగే చంద్రబాబుకు అవసరమైన మందులు, వైద్య చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని ఏసీబీ కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న చంద్రబాబుకు ప్రత్యేక భద్రత కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ప్రత్యేక రూంతో పాటు ఇంటి నుంచి ఫుడ్, మందులు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ క్రమంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇక చంద్రబాబుకు రిమాండ్‌కు బదులు గృహనిర్భంధం విధించాలని చంద్రబాబు లాయర్లు మరో పిటిషన్ దాఖలు చేవారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. అలాగే చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై రేపు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.

Advertisement

Next Story