AP NDA Manifesto : కూటమి మేనిఫెస్టో విడుదల..మహిళలకు గుడ్ న్యూస్

by Disha Web Desk 18 |
AP NDA Manifesto : కూటమి మేనిఫెస్టో విడుదల..మహిళలకు గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తాజాగా ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ , బీజేపీ కీలక నేతలు కలిసి ఈ మేనిఫెస్టోని మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మేనిఫెస్టోలో కీలక అంశాలు మీడియాకు వివరించారు. ఈ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎంత మంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’ కింద ఒక్కొక్కరికి ఏటా రూ.15,000 ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ‘దీపం పథకం’ కింద ఏటా 3 సిలిండర్లు ఫ్రీ అని మేనిఫెస్టోలో వివరించారు. అంతేకాదు రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి అందించనున్నారు. ‘ఆడబిడ్డ నిధి’ కింద 18-59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మేనిఫెస్టోలో వివరించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed